నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 17:46

Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకి తగిన గుణపాఠం చెప్పాలి: చంద్రబాబు..

అమరావతి: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపా(YSRCP)కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections)బుద్ధి చెప్పి... తెలుగుదేశం (TDP) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) కోరారు..

ఎన్నికల్లో ప్రలోభాలు, బోగస్ ఓట్లతో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ తమను ఎలా మోసం చేసిందో ఉద్యోగులు, టీచర్లు గుర్తించి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, భూంరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఎలా మోసం చేసిందో గ్రహించాలి..

''2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించాం. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి పెట్టుబడులు తీసుకొచ్చాం. నాడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువత భవితకు బాటలు వేశాం. నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయి.. నిరుద్యోగం పెరిగిపోయింది. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ గురించి ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అంతా గ్రహించాలి. నాడు విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్‌మెంట్‌ కాదు కదా.. కనీసం ఏనెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా లేదు. టీచర్లకు లిక్కర్ షాపుల వద్ద డ్యూటీలు వేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో టీచర్లు బుద్ధి చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు వైకాపా తెరతీసింది. దొంగ అడ్రస్‌లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే 7వేలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారు'' అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం.. పీడీఎఫ్‌తో ఒక అవగాహనకు వచ్చిందన్నారు. పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి.. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని ప్రజలను, తెలుగుదేశం మద్దతుదారులను కోరారు. ఇదే సందర్భంలో పీడీఎఫ్ అభ్యర్ధులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు తెదేపాకు వేయాలని సూచించారు. ఓటు చీలిపోవడం ద్వారా దుర్మార్గమైన వైకాపా ఎట్టి పరిస్థితుల్లోను గెలవడానికి వీలు లేదని ఆయన తేల్చి చెప్పారు. అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో పరస్పర మార్పిడి జరగాల్సి ఉందన్నారు. పతనం అంచులో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో,చైతన్యంతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు..

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 12:16

CBI : కేసు ఏదైనా సీబీ'ఐ' చూస్తుంది.. విచారణ చేస్తుంది!

ఏయే కేసులు విచారిస్తుంది.. ప్రత్యేక నేరాలు :

నేరస్థులు చేసే తీవ్రమైన నేరాలను విచారణ చేయాలని ఆ కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీం, హైకోర్టులు సీబీఐకి అప్పగిస్తాయి. ఉదాహరణకు టెర్రరిజం, బాంబు పేలుళ్లు, వ్యక్తుల అపహరణలు, మాఫియా, అండర్‌వరల్డ్ నేరాలు వంటివి..

ఆర్థిక నేరాలు : పెద్దపెద్ద ఆర్థిక కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, దొంగనోట్ల తయారీ, బ్యాంకు మోసాలు, సైబర్‌ నేరాలు, ఎగుమతి, దిగుమతులు, విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అవకతవకలు, ఔషధాల రవాణా, పురాతన వస్తువుల సరఫరా, సాంస్కృతిక ఆస్తులు, నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణా కేసులు ఈ విభాగంలోకి వస్తాయి..

అవినీతి నిరోధక నేరాలు : ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులపై నమోదైన అవినీతి కేసులను సీబీఐ విచారిస్తుంది..

సుమోటో కేసులు : కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే నేరాలను సీబీఐ సుమోటోగా తీసుకొని విచారిస్తుంది.

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 11:04

Stomach surgery: కడుపులో వోడ్కా బాటిల్ .. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స

నేపాల్ లో ఓ యువకుడి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కడుపులో వోడ్కా బాటిల్ ఉందని గుర్తించిన డాక్టర్లు ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు..

కడుపులోంచి మద్యం బాటిల్ ను బయటకు తీయడంలో నేపాల్ వైద్యులు విజయం సాధించారు. రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి చెందిన 26ఏళ్ల యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విపరీతమైన కడుపునొప్పి, వాంతులతో నూర్సాద్ మన్సూరి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడినీ ఆస్పత్రికి తరలించారు..

మన్సూరి అనే యువకుడిని డాక్టర్లు ఎండోస్కొపి, స్కానింగ్ లు చేసి.. కడుపులో ఏదో గాజు పదార్థం ఉందని గుర్తించారు. క్షణక్షణానికి ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించారు. డాక్టర్ల టీమ్ అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

కడుపులో ఉన్న వోడ్కా బాటిల్ ను బయటకు తీసేందుకు రెండున్నర గంటల సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు. మద్యం సీసా వల్ల పేషెంట్ పేగు పగిలిందని, దీంతో పరిస్థితి విషమంగా ఉందని శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు పేర్కొన్నారు. పేగు పగిలిపోవడంతో మలం కారుతోంది. ఆపరేట్ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు.. ఈ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి.. కానీ శస్త్రచికిత్స విజయవంతమైంది.. ఇప్పుడు రోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 10:35

పవన్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ నాలుగు రోజుల ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

ఈ మేరకు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 14 వరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో ముఖ్య సమావేశాలు, సమీక్షలు చేయనున్నారు.

ఈ నెల 11న మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బిసి సంక్షేమంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం, 12న ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష, పార్టీలో చేరికలుంటాయని, అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేగొండి హరిరామయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ ఉంటుందని తెలిపారు.

13న ఉదయం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష, అదేరోజు సాయంత్రం 5 గంటలకు గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌తో మర్యాదపూర్వక భేటీ ఉంటుందన్నారు. 14న సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు హాజరవుతారని, పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సభ వరకూ ర్యాలీగా వస్తారని తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 10:23

Gold Smugling: తెలుగు రాష్ట్రాల్లో బంగారం స్మగ్లింగ్.. రైల్వేస్టేషన్లలో పట్టివేత..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం (Gold Smugling) పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secundrabad Railway Station), శ్రీకాకుళం రైల్వే స్టేషన్ల (Srikakulam Railway Station)లో దాదాపు తొమ్మిది కేజీలకు పైగా స్మగ్లింగ్ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు (DRI Officers) స్వాధీనం చేసుకున్నారు..

తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) ని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా (Kolkata) నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (Falaknuma Express) లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద 2.314 కిలోల స్మిగ్లింగ్ బంగారు కడ్డీలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి కోల్‌కతా నుంచి ఈ స్మగ్లింగ్ బంగారాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhrapradesh) శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లోనూ 7.396 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై మెయిల్ (హౌరా నుంచి చెన్నై) ద్వారా కోల్‌కతా నుంచి శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఒక వ్యక్తి వద్ద బంగారాన్ని అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగును క్షుణ్ణంగా వెతకగా.. ట్రాలీ బ్యాగ్ లోపలి జిప్ లైనింగ్ జేబులో ఈ బంగారం బయటపడింది. స్మగ్లింగ్ చేసిన ఈ బంగారం విలువ రూ. 4.21 కోట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి కోల్‌కతాలోని బార్‌లలో కరిగించి/రీకాస్ట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. రెండు చోట్ల దాదాపు ఐదున్న కోట్లు విలువ చేసే బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 08:10

Liquor Scam: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. విచారణపై ఉత్కంఠ

డిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ అధికారుల ముందు హాజరవుతారు..

లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది..

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 08:07

H3N2 Virus | దేశంలో పెరుగుతున్న ఇన్‌ఫ్లూయెంజా కేసులు.. హెచ్‌3ఎన్‌2తో ఆరుగురు మృతి..

న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసుల వ్యాప్తి కలవరపెడుతున్నది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించాయని తాజాగా వస్తున్న వార్తలు భయాందోళన రేపుతున్నది. ఇన్‌ఫ్లూయెంజాతో దేశంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి..

కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో ఒక హెచ్‌3ఎన్‌2 మరణాన్ని అధికారులు ధ్రువీకరించగా.. పంజాబ్‌, హర్యానాల్లో కూడా మరణాలు నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో హెచ్‌3ఎన్‌2 కారణంగా ఈనెల 1న మరణించిన వ్యక్తిని హీరె గౌడ(82)గా అధికారులు గుర్తించారు.

మరణాల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇన్‌ఫ్లుయెంజా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలిపింది. పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో తాజాగా 440 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,294కు చేరింది..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 19:23

రేపు కవితను అరెస్ట్‌ చేయొచ్చు: సీఎం కేసీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

హైదరాబాద్‌: కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు..

''రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం'' అంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ''బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. ​​​మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు'' అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు..

కాగా, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్సే గెలుస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ''డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు ప్లాన్‌ చేసుకోండి. అవసరమైన చోట యాత్రలు, పాదయాత్రలు నిర్వహించాలి'' అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 18:03

RSP, RYF, AIPSU ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి

రెవల్యూషనరి సోషలిస్టు పార్టీ(ఆర్ ఎస్ పి),రెవల్యూషనరి యూత్ ఫ్రoట్(ఆర్ వై ఎఫ్),అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం(ఏ ఐ పి ఎస్ యూ)ల ఆధ్వర్యంలో సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్ ఎస్ పి పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ మాట్లాడుతూ ఈ దేశంలో ఆడవారు చదువుకు దూరంగా ఉంటూ, వంటిళ్లకు మాత్రమే పరిమితం చేసిన బానిస సంకెళ్ళ నుండి వారిని విముక్తి చేసిన వీరనారి అని వారు అన్నారు. అలాగే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు అని వారు స్పష్టంచేశారు.

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా సమాజం పట్ల గాని, చదువు విషయంలో గాని వెనుకబడ్డ మరియు అంధకారంలోకి నెట్టివేయబడ్డ ఎంతో మంది స్త్రీలకు చదువు నేర్పిన చదువుల తల్లి అని వారు తెలిపారు. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ పి, ఆర్ వై ఎఫ్, ఏ ఐ పి ఎస్ యూ నాయకులు అప్పాల కృష్ణ, మంకాల శివ, చేర్యాల సాయి కుమార్, స్రవంతి, సౌమ్య, భాను తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 17:58

CM Kcr: సర్వేలన్నీ మనకే అనుకూలం.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఎన్నికల ఏడాది దృష్ట్యా పలు అంశాలపై అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు..

పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్‌..

షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు పార్టీ సమావేశంలో పాల్గొన్నారు..